Breaking News

TS: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌..

Published on Tue, 06/20/2023 - 09:12

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్‌ను పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో 50, జీవో 51లను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్‌ పే పైన 2.73 శాతం చొప్పున డీఏ/డీఆర్‌ను ప్రభుత్వం పెంచింది. పెంచిన డీఏ/డీఆర్‌ జనవరి 2022 నుంచి అమల్లోకి రానుంది. 

ఈ ఏడాది జూన్‌ నెలకు సంబంధించి తాజాగా పెరిగిన డీఏ/డీఆర్‌ను జూలై నెల వేతనంతో కలిపి అందిస్తారు. గతేడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ, డీఆర్‌ పెంపుదలతో రాష్ట్రవ్యాప్తంగా 7.28 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు సంబంధించిన బకాయిలు రూ.1,380.09 కోట్ల చెల్లింపుపై ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 

డీఏ పెరిగిందిలా.. 
కేటగిరీ ప్రస్తుత డీఏ– పెరిగిన డీఏ 
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు: 20.02% నుంచి 22.75%కు పెంపు 
- యూజీసీ/ఏఐసీటీఈ/ ఎస్‌ఎన్‌ జేపీసీ పేస్కేల్స్‌ (2016): 31% నుంచి 34%కు పెంపు 
- యూజీసీ/ఏఐసీటీఈ/ ఎఫ్‌ఎన్‌ జేపీసీ పేస్కేల్స్‌ (2006): 196% నుంచి 203%కు పెంపు 
- ఫుల్‌ టైమ్‌/ కంటింజెంట్‌: 148.068 శాతానికి పెరుగుదల 
- పార్ట్‌ టైం/ వీఆర్‌ఏలు: నెలకు రూ.100 చొప్పున పెరుగుదల 
(నోట్‌: డీఆర్‌ నిబంధన పరిధిలోనికి రాని పెన్షనర్లకు ఎలాంటి సవరణ ఉండదని, డీఆర్‌ సవరించిన పెన్షనర్లకు తదుపరి రూపాయిని కటాఫ్‌ గా నిర్ణయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.)  

ఇది కూడా చదవండి: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)