Breaking News

ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేస్తా: ఇంద్రసేన్‌రెడ్డి

Published on Tue, 06/13/2023 - 09:04

హైదరాబాద్: ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గ బీజేపీ నేత బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి జస్టిస్‌ బి.సుభాషిణ్‌రెడ్డి మెమోరియల్‌ ఫౌండేషన్‌ ద్వారా కొన్నేళ్లుగా పౌరులకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నాని అన్నారు.

ఇప్పుడు అదే ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానన్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి సమస్యలు వింటుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిలింనగర్‌ బస్తీల్లో పర్యటించినప్పుడు ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని వారి సమస్యలను తెలుసుకున్నాననిన్నారు. కలుషిత నీటి సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామన్నారు.

వేళాపాళా లేకుండా నీరు  వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పైప్‌లైన్‌ వేసి ప్రెషర్‌ పెంచితే సమస్య తగ్గుతుందని అధికారులకు సూచించామన్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డుల కోసం జనం ఎదురు చూస్తున్నారన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు జతపరిచే ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందడం లేదన్నారు. 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)