Breaking News

బండి సంజయ్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

Published on Tue, 07/04/2023 - 21:11

సాక్షి, ఖమ్మం: సంజయ్ అన్నా.. ఇక సెలవు అంటూ తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌  అభిమాని చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. 

ఖమ్మం బీజేపీ టౌన్‌ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్.. ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి సంజయ్‌ను తొలగించడాన్ని తట్టుకోలేకే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు మరీ ప్రకటించుకున్నాడతను. కుటుంబ సభ్యులు స్థానికంగా టౌన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘అన్నా.. ఇక సెలవు.. సంజయన్నను అధ్యక్ష పదవి నుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నా’’ అంటూ తన సహచరులకు, పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారని జిల్లా నేతలు చెబుతున్నారు.

బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో లక్షలాది సంఖ్యలో తప్పుపడుతున్నారు. అదే సమయంలో బండి సంజయ్ ను తప్పించడాన్ని పార్టీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా? అంటూ నిలదీస్తున్నాయి. మరోవైపు బండి సంజయ్ అభిమానులు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు.

ఇదీ చదవండి: బండి సంజయ్‌ను అసలు ఎందుకు తొలగించారు?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)