Breaking News

దత్తపుత్రుడికి ఆస్తి హక్కులుండవ్‌: హైకోర్టు 

Published on Tue, 07/04/2023 - 08:49

సాక్షి, హైదరాబాద్‌: దత్తత వెళ్లక ముందు సొంత (పుట్టిన) తల్లిదండ్రులు ఏదైనా ఆస్తిని కేటాయించి ఉంటే దానిపై దత్తత వెళ్లిన వ్యక్తికి హక్కులు ఉంటా­యి తప్ప.. దత్తత వెళ్లిన అనంతరం ఎలాంటి హక్కు­లు ఉండవని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తికి మాత్రమే వారసుడవుతారని వ్యాఖ్యానించింది. దత్త­త వెళ్లిన తర్వాత సొంత తల్లిదండ్రులతో ఎ­లాంటి సంబంధం ఉండదని చెప్పింది. అలాంటప్పు­డు వారి ఆస్తికి వారసులు కాలేరని స్పష్టం చేసింది.

దత్తతకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ వి­చారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దత్తత వెళ్లినప్పటికీ తనకు సొంత తల్లిదండ్రుల కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఆర్‌ఎల్‌ నరసింహారావు కింది కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు సొంత తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందని తీర్పునిచ్చింది.

దీన్ని సవాల్‌ చేస్తూ అతని సోదరుడు ఎ.నాగేశ్వరరావు హైకోర్టులో లెటర్స్‌ పేటెంట్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. దీని విచారణకు ప్రధా­న న్యాయమూర్తి ఫుల్‌ బెంచ్‌ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ బి.విజ­య్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.  
చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే!

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)