Breaking News

సికంద‌ర్ ర‌జాకు భారీ షాక్‌.. జింబాబ్వే కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Published on Sat, 07/04/2026 - 15:46

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు జింబాబ్వే తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగమయ్యే పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. బంగ్లాతో సిరీస్‌తో ఫాస్ట్‌ బౌలర్‌ రిచర్డ్‌ ఎన్‌గరవ వన్డే కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టనున్నట్లు తెలిపింది.

కాగా గత కొన్నేళ్లుగా జింబాబ్వే బోర్డు.. తమ జట్టు కెప్టెన్లుగా బ్యాటర్లు లేదంటే ఆల్‌రౌండర్లకే అవకాశం ఇచ్చింది. అయితే, ఈసారి మాత్రం సెలక్టర్లు ఫాస్ట్‌ బౌలర్‌ రిచర్డ్‌పై నమ్మకం ఉంచారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 28 ఏళ్ల ఆటగాడికి పగ్గాలు అప్పగించారు.

పదునైన బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించగల సత్తా ఉన్న రిచర్డ్‌.. బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ, బ్రాడ్‌ ఎవాన్స్‌, న్యూమన్‌ నైయామురి, ఎర్రెస్ట్‌ ముసుకులతో కూడిన పేస్‌ దళాన్ని కూడా ముందుకు నడిపించనున్నాడు.

నిజానికి సికిందర్‌ రజా లేదంటే క్రెయిగ్‌ ఎర్విన్‌ జట్టును ముందుకు నడిపిస్తారని భావించగా.. సెలక్టర్లు మాత్రం రిచర్డ్‌ ఎన్‌గరవకే ఓటు వేశారు. కాగా రజా ఇంగ్లండ్‌ టీ20 లీగ్‌ ముగించుకుని ఇటీవలే జింబాబ్వే జట్టుతో చేరగా.. ఎర్విన్‌ టాపార్డర్‌లో కీలక బ్యాటర్‌గా సేవలు అందించనున్నాడు.

రజా, ఎర్విన్‌ నాయకత్వ బృందంలో భాగమైనప్పటికీ ఇకపై పూర్తిస్థాయి కెప్టెన్లుగా మాత్రం వారికి దారులు మూసుకుపోయాయి. అయితే, మైదానంలో తమ అనుభవాన్ని రిచర్డ్‌తో పంచుకునే ఆస్కారం ఉంది.

ఇదిలా ఉంటే.. ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇన్నోసెంట్‌ కియా ఈ సిరీస్‌తో వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తున్నాడు. మరోవైపు.. 20 ఏళ్ల బౌలర్‌ న్యూమన్‌ నైయామురి కూడా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్న న్యూమన్‌.. 2024లో సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియాపై అర్ధ శతకం బాదిన ఆల్‌రౌండర్‌ బ్రియాన్‌ బెనెట్‌ కూడా వన్డే జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్‌ స్టార్లు సామ్‌ కర్రాన్‌, టామ్‌ కర్రాన్‌ల సోదరుడు బెన్‌ కర్రాన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దేశీ క్రికెట్లో సత్తా చాటి 33 ఏళ్ల ఎర్నెస్ట్‌ ముసుకు కూడా వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు జింబాబ్వే జట్టు
రిచర్డ్‌ ఎన్‌గరవ (కెప్టెన్‌), బ్రియాన్‌ బెనెట్‌, ర్యాన్‌ బర్ల్‌, బెన్‌ కర్రాన్‌, క్రెయిగ్‌ ఎర్విన్‌, బ్రాడ్‌ ఇవాన్స్‌, ఇన్నోసెంట్‌ కియా, క్లైవ్‌ మడాండే, వెస్లీ మెధెవెరె, తడివాషి మరుమాని, వెల్లింగ్‌టన్‌ మసకద్జ, ఎర్నెస్ట్‌ ముసుకు, బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ, న్యూమన్‌ నైయామురి, సికందర్‌ రజా.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)