జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్‌ నమోదు!

Published on Mon, 06/26/2023 - 16:44

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 405 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. వన్డే చరిత్రలో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. ఇంతకుముందు 2006లో కెన్యాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 351 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌ కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ స్కోర్‌ను జింబాబ్వే అధిగమించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన అమెరికా తొలుత జింబాబ్వేకు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 101 బంతుల్లోనే 174 పరుగులు చేసిన విలియమ్స్‌.. తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన జింబాబ్వే కెప్టెన్‌గా విలియమ్స్‌ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు గుంబే(78), బర్ల్‌(16 బంతుల్లో 47) పరుగులతో రాణించారు. యూఎస్‌ఏ బౌలర్లలో అభిషేక్‌ మూడు వికెట్లు, జష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు సాధించారు.
చదవండి: Yashasvi Jaiswal: ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేయలేను.. ఆ విషయం గురించి చెప్పడానికి సిగ్గుపడను!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)