Breaking News

'జట్టు గెలుపుకన్నా ఇదెక్కువ ఆనందాన్నిస్తోంది'

Published on Tue, 06/20/2023 - 13:45

జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌(ICC CWC Qualifiers 2023) మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది.

కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్‌ ఎర్విన్‌ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్‌ వల్ల బీసీసీఐకే నష్టం'

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)