Breaking News

ఓర్నీ.. ఇదేమి సెలబ్రేష‌న్స్ రా బాబు! అంపైర్‌ను భ‌య‌పెట్టాడు(వీడియో)

Published on Thu, 08/01/2024 - 10:09

జింబాబ్వే దేశీవాళీ క్రికెట్ టోర్నీ నేష‌న‌ల్ వ‌న్డే క‌ప్‌-2024లో విచిత్రక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ జింబాబ్వే క్రికెటర్ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్ శ్రుతిమించాయి. స‌దరు బ్యాట‌ర్‌ ఓవ‌రాక్ష‌న్ కార‌ణంగా ఆన్ ఫీల్డ్‌ అంపైర్ కాలికి గాయ‌మైంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీని చ‌ద‌వాల్సిందే.

అస‌లేం జ‌రిగిందంటే?
ఈ టోర్నీలో భాగంగా బుధ‌వారం  ఓగో రేంజ‌ర్స్‌, రెయిన్ బో 1 క్రికెట్ క్ల‌బ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 45 ఓవ‌ర్ల‌కు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన  ఓగో రేంజ‌ర్స్ నిర్ణీత 45 ఓవ‌ర్ల‌లో 229 ప‌రుగులు చేసింది. అనంత‌రం 230 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రెయిన్‌బో 1 క్రికెట్ క్లబ్ స‌రిగ్గా 44.5 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 224 ప‌రుగులు చేసింది. 

దీంతో రెయిన్ బో జ‌ట్టు విజ‌యానికి ఆఖ‌రి బంతికి 4 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఓగో రేంజ‌ర్స్ స్పిన్న‌ర్‌  ర్యాన్ బర్ల్ వేసిన బంతిని  ఫ్రాన్సిస్ సాండే అద్భుత‌మైన సిక్స్ కొట్టి రెయిన్‌బో క్రికెట్ క్ల‌బ్‌కు విజ‌యాన్ని అందించాడు. ఇక్క‌డ వ‌ర‌కు అంత బాగానే ఉన్న మ్యాచ్‌ను గెలిపించిన సాండే అతి చేశాడు. 

సిక్స్ కొట్టిన వెంట‌నే త‌న బ్యాట్‌ను బ‌లంగా నాన్‌స్ట్రైక్ వైపు విసిరాడు. దీంతో  ఆ బ్యాట్ కాస్త అంపైర్ కాలికి తాకింది. అంపైర్ నొప్పితో కాసేపు విల్ల‌విల్లాడు. కానీ ఫ్రాన్సిస్ సాండే మాత్రం అంపైర్‌కు క‌నీసం క్ష‌మాప‌ణ కూడా చెప్ప‌లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజన్లు   అతడు కావాల‌నే త‌న బ్యాట్‌ను అంపైర్ విసిరాడ‌ని కామెంట్లు చేస్తున్నారు.


 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)