Breaking News

PCB: పీసీబీ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్‌ నియామకం

Published on Thu, 07/06/2023 - 19:37

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్‌ నియమితుడయ్యాడు. పది మంది సభ్యులతో కూడిన కమిటీకి అతడు నేతృత్వం వహించనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్‌ ప్రభుత్వం నియామకాలు జరిపినట్లు పీసీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది.

కాగా జకా ఆష్రఫ్‌ సారథ్యంలోని ఈ కమిటీ నాలుగు నెలల పాటు అధికారంలో కొనసాగనుంది. ఇందులో నలుగురు రీజినల్‌ రిప్రెజెంటేటివ్స్‌, నలుగురు సర్వీస్‌ రిప్రెజెంటేటివ్స్‌, ప్రధాని చేత నామినేట్‌ చేయబడిన ఇద్దరు సభ్యులకు చోటు ఉంటుంది.  

ఈ నేపథ్యంలో జకా ఆష్రఫ్‌ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు అధికారికంగా పీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో పీసీబీలో సానుకూల మార్పులు తీసుకురాగలనని ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నా’’ అంటూ తన నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్‌ ఫొటోను షేర్‌ చేశాడు. కాగా ఆసియాకప్‌, వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కమిటీ గురువారమే లాహోర్‌లో సమావేశం కానుంది. 
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)