Breaking News

అరంగేట్రంలో అదుర్స్‌.. తొలి మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌

Published on Sat, 08/09/2025 - 21:42

బుల‌వాయో వేదిక‌గా జింబాబ్వేతో రెండో టెస్టును న్యూజిలాండ్ కేవ‌లం మూడు రోజుల్లోనే ముగించింది. ఆతిథ్య జింబాబ్వేను ఇన్నింగ్స్ అండ్ 359 ప‌రుగుల‌తో తేడాతో కివీస్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అరంగేట్ర ఆట‌గాడు జకారీ ఫౌల్కేస్ అద్బుత‌మైన ప్రద‌ర్శ‌న కన‌బ‌రిచాడు.

మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం 75 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో ఫౌల్కేస్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. కివీస్ తరపున అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించిన ప్లేయ‌ర్‌గా ఫౌల్కేస్ చరిత్ర సృష్టించాడు.

ఇంత‌కుముందు ఈ రికార్డు కివీ స్పీడ్ స్టార్ విల్ ఓ'రూర్కే పేరిట ఉండేది. గ‌తేడాది హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రూర్కే 93 ప‌రుగులిచ్చి 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా మ్యాచ్‌తో రూర్కే ఆల్‌టైమ్ రికార్డును జకారీ బ్రేక్ చేశాడు.

ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఈ రికార్డు భార‌త మాజీ స్పిన్న‌ర్ నరేంద్ర హిర్వానీ పేరిట ఉంది. హిర్వానీ 1988లో మద్రాసు (ఇప్పుడు చెన్నై) వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు కేవ‌లం 136 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 16 వికెట్లు సాధించాడు.

సిరీస్‌ వైట్‌ వాష్‌..
కాగా జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ వైట్‌ వాష్‌ చేసింది. ఈ రెండో టెస్టులో మాట్‌ హెన్రీ సైతం నిప్పులు చెరిగాడు. హెన్రి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వి​కెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో డెవాన్‌ కాన్వే (245 బంతుల్లో 153) ,హెన్రీ నికోల్స్(150 నాటౌట్), రచిన్ రవీంద్ర(165 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?