వరల్డ్‌ కప్‌ జట్టు సెలక్షన్‌పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు?

Published on Sat, 09/30/2023 - 13:13

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అనుహ్యంగా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయపడడంతో.. అశ్విన్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌  యువరాజ్ సింగ్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు.  

అశ్విన్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని యువీ అన్నాడు. కాగా అశ్విన్‌కు ఇది మూడో వన్డే ప్రపంచకప్‌. అంతకముందు 2011, 2015 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు అశ్విన్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా టోర్నీల్లో 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌.. 13 వికెట్లు పడగొట్టాడు.

"అక్షర్‌ అందుబాటులో లేకపోవడంతో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌ చేసే ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సింది. అక్షర్‌ పటేల్‌ స్ధానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది. మరో లెఫ్ట్‌ హ్యాండ్‌ ఆటగాడు జట్టులో ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతడిని ఎంపిక చేయలేదు. యుజ్వేంద్ర చాహల్‌ను అయినా తీసుకోవాల్సిందని" హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: భారత్‌, ఆసీస్‌, పాక్‌ కాదు.. ఆ జట్టే వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఫేవరేట్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)