Breaking News

గుజ‌రాత్ కాదు.. ఆ జట్టు హెడ్ కోచ్‌గా య‌వ‌రాజ్‌!?

Published on Sun, 08/25/2024 - 08:19

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు ఫ్రాంచైజీలు వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఆట‌గాళ్ల‌తో పాటు త‌మ కోచింగ్ స్టాప్‌లో కూడా మార్పులు దిశ‌గా ఆయా ఫ్రాంచైజీలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేయ‌గా.. గుజ‌రాత్ టైటాన్స్ సైతం త‌మ ప్ర‌ధాన కోచ్ ఆశిష్ నెహ్రాను త‌ప్పించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కూడా త‌మ హెడ్‌కోచ్‌గా ఉన్న కుమార సంగ‌ర్క‌ర‌ను త‌ప్పించి రాహుల్ ద్ర‌విడ్‌కు కోచింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ద్ర‌విడ్‌తో రాజ‌స్తాన్ ఫ్రాంచైజీ సంప్ర‌దింపులు జ‌రిపినట్లు వినికిడి.

ఢిల్లీ హెడ్‌కోచ్‌గా యువ‌రాజ్ సింగ్‌..?
కాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్‌కోచ్‌గా భార‌త క్రికెట్ దిగ్గ‌జం యువ‌రాజ్ సింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టున్న‌ట్లు తెలుస్తోంది. రికీ పాంటింగ్ స్ధానంలో యువ‌రాజ్‌ను నియ‌మించాల‌ని ఢిల్లీ యాజ‌మాన్యం యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే యువీతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చ‌ర్చ‌లు మొద‌లు పెట్టిన‌ట్లు స్పోర్ట్‌స్టార్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. 

అయితే యువీ నుంచి కానీ, ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి ఈ విష‌యంపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెల‌వ‌డ‌లేదు. మొద‌టిలో గుజ‌రాత్ టైటాన్స్‌గా ప్ర‌ధాన కోచ్‌గా యువ‌రాజ్ సింగ్ వెళ్ల‌నున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ కూడా అత‌డిని త‌మ హెడ్‌కోచ్‌గా నియ‌మించుకునేందుకు ఆస‌క్తిగా ఉందంట‌.

కాగా యువీ ఇప్ప‌టివ‌ర‌కు హెడ్‌కోచ్‌గా ప‌నిచేయ‌న‌ప్ప‌ట‌కి.. చాలా మంది పంజాబ్ యువ క్రికెట‌ర్ల‌ను తీర్చిదిద్ద‌డంలో యువ‌రాజ్‌ది కీల‌క‌పాత్ర‌.  శుభ్‌మన్ గిల్, అభిషేక్ శ‌ర్మ వంటి యువ ఆట‌గాళ్లు యువరాజ్ గైడ‌న్స్‌లో రాటుదేలిన వారే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)