Breaking News

కోనేరు హంపికి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Published on Mon, 07/21/2025 - 13:30

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి సెమీస్‌ చేరిన తొలి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హంపి సాధించిన అరుదైన ఘనత  భారత్‌కు గర్వకారణమన్నారు.

యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని.. ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలనని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. కాగా మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ (FIDE World Cup)లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

యుజిన్‌ సాంగ్‌ను ఓడించి..
యుజిన్‌ సాంగ్‌ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో హంపి 1.5–0.5తో గెలుపొందింది. శనివారం జరిగిన తొలి గేమ్‌లో నెగ్గిన హంపి... ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో చైనాకే చెందిన టింగ్‌జి లెతో హంపి తలపడుతుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో టింగ్‌జి లె 2–0తో నానా జాగ్‌నిద్జె (జార్జియా)పై గెలిచింది.

హారిక, దివ్య పోరు
మరోవైపు.. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. జోంగి టాన్‌ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వైశాలి 0.5–1.5తో ఓడిపోయింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న వైశాలి... ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో 88 ఎత్తుల్లో ఓటమి పాలైంది. 

కోనేరు హంపికి వైఎస్ జగన్ అభినందనలు

ఇక భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్‌ నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో వీరిద్దరి మధ్య విజేత ఎవరో సోమవారం జరిగే టైబ్రేక్‌ గేమ్‌ల ద్వారా తేలుతుంది. వీరిద్దరి మధ్య ఆదివారం జరిగిన రెండో గేమ్‌ 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.

 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)