Breaking News

మ్యాచ్‌ మ్యాచ్‌కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే!

Published on Wed, 07/05/2023 - 12:38

భారత్‌లో క్రికెట్‌ అంటే ఒక మతం. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెటే ఎక్కువ మంది అభిమానించే ఆటగా మారిపోయింది. మ్యాచ్‌ ప్రారంభం కాకముందే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు  ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇంతవరకు అంతబాగానే ఉన్న బెట్టింగ్‌ అనే భూతం మాత్రం మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తుంది. బెట్టింగ్‌ మాయలో పడి చిన్న పెద్ద తేడా లేకుండా తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు.

ముఖ్యంగా బెట్టింగ్‌కు బలయ్యేది ఎక్కువగా యువకులే. టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు పుట్టుగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్క మ్యాచ్ కాకపోతే.. మరో మ్యాచ్ లో అయినా డబ్బులొస్తాయనే ఆశతో అప్పుల మీద అప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత అప్పులు ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరుచూ  ఎదోఒక చోట జరుగుతునే ఉంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో బెట్టింగ్‌లు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. మన పక్కరాష్ట్రం తమిళనాడులో కూడా గత మూడేళ్లలో 40 మంది ప్రాణాలను ఈ బెట్టింగ్‌ భూతం మింగేసింది.

ఇది చూస్తే మనం అర్ధం చేసుకోవచ్చు బెట్టింగ్‌ మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. ఇక యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూద క్రీడలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కట్టడి చేయాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలు ఆన్‌లైన్‌ క్రీడలు, బెట్టింగ్‌లను నిషేధించాయి.

బెట్టింగ్ భూతానికి  బలైన యువకుడు..
తాజాగా ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మరో యువకుడు బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా  పాయకరావుపేటకు చెందిన మణికంఠ సాయికుమార్‌ (25) క్రికెట్‌ బెట్టింగ్‌లకు గత కొంత కాలంగా అలవాటు పడ్డాడు. దీంతో బయట అప్పులు చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి.. అప్పులపాలు అయ్యాడు.

దీంతో బెట్టింగ్ కోసం  చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అంది వచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇది ఒక్క మణికంట కుటంబంలోనే కాదు.. ఈ క్షోభ చాలా మంది కుటుంబాల్లో నెలకొంటోంది.

క్రికెట్‌ను అభిమానించండి తప్పులేదు.. బెట్టింగ్‌లకు మాత్రం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇకనైన కళ్లు తెరవండి, బెట్టింగ్ మానండి.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)