Breaking News

గిల్‌ నేర్చుకుంటున్నాడు.. కానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి

Published on Fri, 06/09/2023 - 14:03

ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే.  తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో వెటరన్‌ ఆటగాడు చతేశ్వర్‌ పుజారా ఔటైన తీరుపై భారత మాజీ హెడ్‌ కోచ్ రవిశాస్త్రి విమర్శల వర్షం కురిపించాడు. చెత్త షాట్ సెలెక్షన్ వల్లే పుజారా క్లీన్‌ బౌల్డయ్యాడు. గ్రీన్‌ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన పుజారా బౌల్డయ్యాడు. అంతకుముందు అదే రీతిలో బోలాండ్‌ బౌలింగ్‌లో గిల్‌ కూడా ఔటయ్యాడు. 

"పుజారా లాంటి సీనియర్‌ ఆటగాడు బంతిని తప్పుగా అంచనా వేయడం నిరాశపరిచింది. ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని వదిలేయడం దారుణం. అతడి ఫ్రంట్ ఫుట్ బంతివైపు వెళ్లాల్సింది. అతడు ఆ బంతిని ముందు ఆడాలని అనుకున్నాడు. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోని బంతిని విడిచిపెట్టాడు.

అందుకు తగ్గ ప్రతిఫలం అనువభవించాడు. ఆఫ్‌స్టంప్‌ ఎగిరిపోయింది. ఆ సమయంలో ఆఫ్‌స్టంప్‌కు వెళ్లాల్సిన అతడి ఫ్రంట్ ఫుట్ మిడిల్‌ స్టంప్‌పైనే ఉండిపోయింది. కానీ అతడు మాత్రం తన ఫ్రంట్ ఫుట్ ఆఫ్‌స్టంప్‌ పైనే ఉందని అనుకున్నాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌ కూడా ఇదే తరహాలో తన వికెట్‌ను కోల్పోయాడు.

ఇంగ్లండ్‌ పిచ్‌లపై బంతిని ఆడకుండా వదిలేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్‌స్టంప్‌ దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయాలి. శుభమాన్ గిల్ తన ఫుట్‌వర్క్‌లో విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. అయితే గిల్‌ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. కానీ పుజరాకు ఏమైంది" అని  కామెంటరీ సందర్బంగా రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్‌ ఉందా? కనీసం డ్రా అయినా

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)