Breaking News

Paris Olympics 2024: క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన నిషా దాహియా

Published on Mon, 08/05/2024 - 20:38

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇవాళ (ఆగస్ట్‌ 5) భారత్‌కు అస్సలు కలిసి రాలేదు. ఇవాళ జరిగిన రెండు కాంస్య పతక పోటీల్లో భారత్‌ ఆటగాళ్లు పరాజయాలు ఎదుర్కొన్నారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌.. మలేషియాకు చెందిన జెడ్‌ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. షూటింగ్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు జోడీ అనంత్‌జీత్‌ సింగ్‌ నరౌకా-మహేశ్వరి చౌహాన్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుంది. 

క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన నిషా దాహియా 
మహిళల రెజ్లింగ్‌ 68 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ నిషా దాహియా క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైంది. నిషా ఉత్తర కొరియాకు చెందిన పాక్‌ సోల్‌ గమ్‌తో చేతిలో 8-10 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో నిషా ఆధిక్యంలో ఉన్నప్పుడు గాయపడింది. తద్వారా స్వల్ప తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఓటమి అనంతరం నిషా కన్నీటిపర్యంతమైంది. 

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో నిషా.. ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా సోవాపై 6-4 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నిషా 1-4తో వెనుకపడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)