Breaking News

మహిళల ఐపీఎల్‌ మార్చి 4 నుంచి ప్రారంభం

Published on Tue, 02/07/2023 - 11:07

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్‌కు (డబ్ల్యూపీఎల్‌) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్‌, డీవై పాటిల్‌ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్‌ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్‌ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.

లీగ్‌ ఆరంభ మ్యాచ్‌ గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్‌కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్‌ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు..

  • అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)-గుజరాత్‌ జెయింట్స్‌
  • ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్‌
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
  • జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్‌
  • క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్‌ జెయింట్స్‌
     

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)