Breaking News

మహిళల ఐపీఎల్‌ వేలం ఎప్పుడు, ఎక్కడ అంటే..?

Published on Fri, 11/29/2024 - 06:39

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల 15న బెంగళూరులో నిర్వహించనున్నారు. వచ్చే సీజన్‌ ఫిబ్రవరి–మార్చి నెలలో జరుగుతుంది. ఐదు ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్‌ రూ. 15 కోట్లు. గత సీజన్‌ రూ. 13.5 కోట్ల కంటే కొంచెం పెరిగింది. 

ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్‌ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హిథెర్‌ నైట్, న్యూజిలాండ్‌ పేసర్‌ లీ తహుహు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్ర డాటిన్‌ తదితర టాప్‌ స్టార్లు వేలంలో ఉన్నారు. 

వీరితో పాటు భారత్‌కు చెందిన స్నేహ్‌ రాణా, పూనమ్‌ యాదవ్, వేద కృష్ణమూర్తిలు కూడా వేలంలోకి వచ్చారు. గత రెండు సీజన్లు (2023, 2024)గా రన్నరప్‌తో సరిపెట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రూ.2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. 

గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో గరిష్టంగా రూ. 4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వద్ద రూ. 3.25 కోట్లున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా... ఒక్క డ్యానీ వ్యాట్‌ (ఇంగ్లండ్‌) బదిలీ జరిగింది. యూపీ వారియర్స్‌ నుంచి ఆర్‌సీబీ ఆమెను కొనుక్కుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)