Breaking News

క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి

Published on Wed, 03/06/2024 - 19:02

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (సౌతాఫ్రికా) సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌ మూడో ఓవర్‌లో షబ్నిమ్‌ మహిళల క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించింది. ఈ ఓవర్‌ రెండో బంతిని షబ్నిమ్‌ 132.1 కిమీ వేగంతో సంధించింది. మహిళల క్రికెట్‌ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. షబ్నిమ్‌ రికార్డును ఆమెనే బ్రేక్‌ చేసుకుంది. 

2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షబ్నిమ్‌ 128 కిమీ వేగంతో బంతిని సంధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మహిళల క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ డెలివరీగా ఉండింది. 2022 వన్డే వరల్డ్‌కప్‌లో షబ్నిమ్‌ రెండు సార్లు 127 కిమీ వేగంతో బంతులను సంధించింది. తాజాగా తన పేరిట ఉండిన రికార్డును షబ్నిమ్‌ తనే బ్రేక్‌ చేసుకుంది. మహిళల క్రికెట్‌లో 130 కిమీలకు పైగా వేగంతో నమోదైన బంతి ఇదే కావడం మరో విశేషం​.  

ఇదిలా ఉంటే, షబ్నిమ్‌ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై 168 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ​్‌లో షబ్నిమ్‌ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టింది.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)