Breaking News

ముంబై బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైన గుజరాత్‌

Published on Sun, 02/25/2024 - 21:13

మహిళల ఐపీఎల్‌ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 25) ముంబై ఇండియన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. 

ముంబై బౌలర్లు అమేలియా కెర్‌ (4-0-17-4), షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (4-0-18-3) అద్భుత ప్రదర్శనలతో గుజరాత్‌ పతనాన్ని శాశించారు. నాట్‌ సీవర్‌ బ్రంట్‌, హేలీ మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అమేలియా కెర్‌ ఆఖర్‌ ఓవర్‌లో 2 వికెట్లు తీసి గుజరాత్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసింది.

తనుజా కన్వర్‌ (28) ఆఖర్లో బ్యాట్‌ ఝులిపించకపోయుంటే గుజరాత్‌ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో కేథరీన్‌ బ్రైస్‌ (25 నాటౌట్‌), కెప్టెన్‌ బెత్‌ మూనీ ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. వేద కృష్ణమూర్తి (0), హర్లీన్‌ డియోల్‌ (8), లిచ్‌ఫీల్డ్‌ (7), దయాలన్‌ హేమలత (3), ఆష్లే గార్డ్‌నర్‌ (15), స్నేహ్‌ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు.

ప్రస్తుత ఎడిషన్‌లో గుజరాత్‌కు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి, ఖాతా తెరిచింది.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)