Breaking News

WPL 2024 Final Updates: ఛాంపియన్స్‌గా ఆర్సీబీ..

Published on Sun, 03/17/2024 - 19:08

►డబ్ల్యూపీఎల్‌-2024 ఛాంపియన్స్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది.

114 పరుగుల లక్ష్య ఛేదన.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
114 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 49 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్‌లో సోఫీ డివైన్‌ (32) ఔటైంది. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 53/1గా ఉంది. స్మృతి మంధన (20), ఎల్లిస్‌ పెర్రీ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.

114 పరుగుల స్వల్ప లక్ష్యం.. ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ
ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. స్మృతి మంధన 12, సోఫీ డివైన్‌ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

ఆర్సీబీతో ఫైనల్‌.. 113 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ
ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్‌కే చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్‌ పాటిల్‌ 4, సోఫీ మోలినెక్స్‌ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌
6 ఓవర్లలో 61 పరుగులు చేసి వికెట్లు కోల్పోని ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. సోఫీ మోలినెక్స్‌ (3-0-14-3), శ్రేయాంక పాటిల్‌ (3-0-10-2), ఆశా శోభన​ (2-0-9-2) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ కుప్పకూలే దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో ఆ జట్టు స్కోర్‌ 90/7గా ఉంది. అరుంధతి రెడ్డి (2), రాధా యాదవ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. 

మాయ చేసిన సోఫీ మోలినెక్స్‌..ఒకే ఓవర్‌లో 3 వికెట్లు
ఎనిమిదో ఓవర్‌లో ఆర్సీబీ స్పిన్నర్‌ సోఫీ మోలినెక్స్‌ మాయ చేసింది. ఈ ఓవర్లో ఆమె ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచింది. ఆ ఓవర్ల అనంతరం 61/0గా ఉన్న ఢిల్లీ స్కోర్‌ సోఫీ దెబ్బకు ఒక్క సారిగా పడిపోయింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్‌ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్‌ను (0), నాలుగో బంతికి అలైస్‌ క్యాప్సీ (0) పెవిలియన్‌కు పంపింది. 9 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 69/3గా ఉంది. లాన్నింగ​్‌ (20), మారిజన్‌ కాప్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు.

విధ్వంసం సృష్టిస్తున్న షఫాలీ వర్మ
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. షఫాలీ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అజేయంగా ఉంది. షఫాలీకి మెగ్‌ లాన్నింగ్‌ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) సహకరిస్తుంది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్‌ 61/0గా ఉంది. 

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన ఢిల్లీ ఈ సారి టైటిల్‌పై ధీమాగా ఉండగా.. తొలి టైటిల్‌ కోసం ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంది. 

తుది జట్లు..

ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లాన్నింగ్‌(కెప్టెన్‌), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్‌కీపర్‌), శిఖా పాండే, మిన్ను మణి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక సింగ్‌

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)