Breaking News

WPL 2023 Final: తొలి టైటిల్‌ కొట్టేదెవరు?

Published on Sun, 03/26/2023 - 05:46

ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్‌ చేరేందుకు ఎలిమినేటర్‌ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది.

ఢిల్లీ బ్యాటింగ్‌ భారం ఓపెనర్‌ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్‌ కప్‌ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌లో లేకపోయినా నాట్‌ సివర్, హీలీ మాథ్యూస్‌ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్‌ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్‌ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్‌ లైనప్‌ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్‌ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్‌ ఇసీ వాంగ్‌ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్‌ సమరం ఖాయం.
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు