Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్‌ ఆశలు సజీవం

Published on Thu, 03/16/2023 - 22:37

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌ తన ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలుపుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌  136 పరుగులకు ఆలౌట్‌ అయింది.

మారిజన్నే కాప్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా..  అరుంధతీ రెడ్డి 25 పరుగులు, ఎలిస్‌ క్యాప్సీ 22 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో తనూజా కన్వర్‌ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్‌, కిమ్‌ గార్త్‌, హర్లిన్‌ డియోల్‌, స్నేహ్‌రాణా తలా ఒక వికెట్‌ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ఓపెనర్‌ లారా వోల్వార్డాట్‌ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌), అష్లే గార్డనర్‌(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్‌ డియోల్‌ 31 పరుగులు రాణించడంతో గుజరాత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్‌లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో జెస్‌ జొనాసెన్‌ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్‌ చెరొక వికెట్‌ తీశారు.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)