Breaking News

విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌

Published on Mon, 03/20/2023 - 21:17

డబ్ల్యూపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (మార్చి 20) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ సేన, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. మారిజన్‌ కాప్‌ (4-0-13-2), శిఖా పాండే (4-0-21-2), జెస్‌ జొనాస్సెన్‌ (4-0-25-2), అరుంధతి రెడ్డి (3-0-10-1) విజృంభించడంతో ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఓ దశలో ముంబై టీమ్‌ కనీసం 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్నా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌), ఇస్సీ వాంగ్‌ (24 బంతుల్లో 23, సిక్స్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) పుణ్యమా 109 పరుగులు చేయగలిగింది. యస్తికా భాటియా (1), హేలీ మాథ్యూస్‌ (5), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (0), అమేలియా కెర్‌ (8) విఫలమయ్యారు.

కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-3లో ఉన్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్జ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)