Breaking News

సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి చుక్కెదురు

Published on Wed, 05/29/2024 - 04:10

సింగపూర్‌: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్‌– చిరాగ్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. 

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్న డానియల్‌ లుండ్‌గార్డ్‌– మాడ్స్‌ వెస్టెర్‌గార్డ్‌ (డెన్మార్క్‌) ద్వయం 22–20, 21–18తో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు  గేముల్లోనూ పలు దశల్లో  సాత్విక్‌–చిరాగ్‌ ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 

ఈ టోర్నీకి ముందు సాత్విక్‌–చిరాగ్‌ సీజన్‌లో ఆరు టోర్నీలు ఆడి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలో, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్స్‌ నెగ్గారు. మలేసియా సూపర్‌–1000, ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు.  

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)