World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్‌

Published on Tue, 11/07/2023 - 00:48

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్‌ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్‌–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్‌ కీలకంగా మారింది.

మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్‌ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్‌ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్‌ హొస్సేన్‌ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబుల్‌ హసన్‌ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు.

చివర్లో తౌహిద్‌ హ్రిదయ్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్‌ విజయాన్ని ఖాయం చేశారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్‌ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్‌ హసన్‌ (3/80), షోరిఫుల్‌ (2/51), షకీబుల్‌ హసన్‌ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు.

అనంతరం బంగ్లాదేశ్‌ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్‌ హసన్‌ (9), లిటన్‌ దాస్‌ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్‌ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్‌ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్‌ (10), మిరాజ్‌ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్‌ జట్టును విజయతీరానికి చేర్చారు.

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (బి) తంజిమ్‌ 41; పెరీరా (సి) ముష్ఫికర్‌ (బి) షోరిఫుల్‌ 4; మెండిస్‌ (సి) షోరిఫుల్‌ (బి) షకీబ్‌ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్‌ 41; అసలంక (సి) లిటన్‌ (బి) తంజిమ్‌ 108; మాథ్యూస్‌ (టైమ్డ్‌ అవుట్‌) 0; ధనంజయ (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) మిరాజ్‌ 34; తీక్షణ (సి) సబ్‌–అహ్మద్‌ (బి) షోరిఫుల్‌ 21; చమీర (రనౌట్‌) 4; రజిత (సి) లిటన్‌ (బి) తంజిమ్‌ 0; మదుషంక (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 279.
వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279.
బౌలింగ్‌: షోరిఫుల్‌ 9.3–0–51–2, టస్కిన్‌ 10–1–39–0, తంజిమ్‌ హసన్‌ 10–0–80–3, షకీబ్‌ 10–0–57–2, మిరాజ్‌ 10–0–49–1.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్‌ దాస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్‌ (బి) మాథ్యూస్‌ 90; షకీబ్‌ (సి) అసలంక (బి) మాథ్యూస్‌ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్‌ (బి) మదుషంక 10; తౌహిద్‌ (నాటౌట్‌) 15; మిరాజ్‌ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282.
వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269.
బౌలింగ్‌: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్‌ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్‌ 7.1–1–35–2,  
ధనంజయ డిసిల్వా 3–0–20–0.   

ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్‌
వేదిక: ముంబై
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)