Breaking News

ప్రిక్వార్టర్స్‌లో అర్జున్‌

Published on Fri, 08/11/2023 - 09:22

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అర్జున్‌తోపాటు భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతి కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.

నాలుగో రౌండ్‌లో అర్జున్‌ 1.5–0.5తో సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై, విదిత్‌ 1.5–0.5తో ఎటెని బాక్రోట్‌ (ఫ్రాన్స్‌) పై గెలుపొందారు. సిందరోవ్‌తో బుధవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్‌ గురువారం జరిగిన రెండో గేమ్‌లో 60 ఎత్తుల్లో నెగ్గాడు.

బాక్రోట్‌తో బుధవారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన విదిత్‌ గురువారం జరిగిన రెండో గేమ్‌ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నాలుగో రౌండ్‌లో రెండు గేమ్‌లు ముగిశాక గుకేశ్‌ (భారత్‌)–ఎసిపెంకో (రష్యా); ప్రజ్ఞానంద (భారత్‌)–నకముర (అమెరికా); నిహాల్‌ (భారత్‌) –నెపోమ్‌నిశి (రష్యా) 1–1తో సమంగా ఉండటంతో వీరి మధ్య నేడు టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహిస్తారు.  

మరోవైపు మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా శుక్రవారం టైబ్రేక్‌ గేమ్‌లు ఆడనున్నారు. బెలా ఖొటె    నాష్వి‌లి (జార్జియా)తో తొలి గేమ్‌లో ఓడిన హంపి గురువారం జరిగిన రెండో గేమ్‌లో 42 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. హారిక, ఎలైన్‌ రోబర్స్‌ (నెదర్లాండ్స్‌) మధ్య రెండో గేమ్‌ కూడా ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరూ 1–1తో సమంగా ఉన్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?