మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
World Boxing Championship: హుసాముద్దీన్ శుభారంభం
Published on Tue, 05/02/2023 - 09:41
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) శుభారంభం చేయగా... వరిందర్ సింగ్ (60 కేజీలు) మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.
తొలి రౌండ్‌లో హుసాముద్దీన్ 5–0తో అలెన్ రుస్తెమోవ్‌స్కీ (మెసెడోనియా)పై గెలుపొందగా... వరిందర్ 0–5తో తుర్సునోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ నుంచి 13 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.
మురళీ శ్రీశంకర్‌కు స్వర్ణం
Murali Shankar Won Gold At MVA High Performance: ఎంవీఏ హై పెర్ఫార్మన్స్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత ప్లేయర్ మురళీ శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మీట్‌లో 24 ఏళ్ల శ్రీశంకర్ 8.29 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ మీట్‌లో శ్రీశంకర్ వచ్చే ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణాన్ని (8.25 మీటర్లు) అధిగమించాడు. అయితే మైదానంలో గాలివేగం నిర్ణీత ప్రమాణంకంటే ఎక్కువ ఉండటంతో శ్రీశంకర్ ప్రదర్శనకు ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్ లభించలేదు.
Tags : 1