ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్‌ మృతి

Published on Thu, 05/02/2024 - 23:01

ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్‌షైర్ క్రికెట్ క్ల‌బ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్త‌ను వోర్సెస్టర్‌షైర్ క్ల‌బ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.

అయితే బేకర్ మరణానికి గల కారమైతే  ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్‌షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు. 

అతడు చివ‌ర‌గా వోర్సెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్ త‌ర‌పున గ‌త నెల‌లో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన బేకర్.. త‌న కెరీర్‌లో 47 మ్యాచ్‌లు ఆడి 525 ప‌రుగుల‌తో పాటు 70 వికెట్లు పడగొట్టాడు. 

అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన‌  ఇంగ్లండ్ రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేక‌ర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.

Videos

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ

DSCలో అక్రమాలు నిజమేనని అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు

అధికారులు ముందుకు.. మంత్రిగారు వెనక్కి.. DSCలో బయటపడుతున్న లోకేశ్ లీలలు

TDP ఆఫీసులో వివేకాను చంపిన హంతకుడు

అందరికి ఒక్కటే చెప్తున్నా.. విచారణ తర్వాత నందన రియాక్షన్

కాకినాడ నిరుద్యోగులపై కేసులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

అధికారుల అబద్దాలతో అడ్డంగా దొరికిపోయిన లోకేష్.. యాంకర్ ఈశ్వర్ మాస్ ర్యాగింగ్

DSC అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే

దారుణం... తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై విరిగిన విగ్రహం

Photos

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)