Breaking News

దీపిక ‘హ్యాట్రిక్‌’

Published on Tue, 12/10/2024 - 04:49

మస్కట్‌ (ఒమన్‌): జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో జ్యోతి సింగ్‌ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్‌ చేసింది. 

వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్‌ (38వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్‌లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్‌లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్‌ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. 

మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్‌ తేడాతో చైనీస్‌ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్‌ (27) సంఖ్యకంటే భారత్‌ చేసిన గోల్స్‌ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్‌ ర్యాంక్‌లో, భారత్‌ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో భారత్‌ తలపడుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)