Breaking News

మహిళల హాకీ ఇండియా లీగ్‌ వేలం... ఉదిత దుహాన్‌కు రూ. 32 లక్షలు

Published on Wed, 10/16/2024 - 03:02

హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) మహిళల టోర్నమెంట్‌కు సంబంధించి మంగళవారం వేలం కార్యక్రమం జరిగింది. భారత జట్టు డిఫెండర్‌ ఉదిత దుహాన్‌కు అత్యధికంగా రూ. 32 లక్షలు లభించాయి. శ్రాచి రార్‌ బెంగాల్‌ టైగర్స్‌ జట్టు ఉదితను కొనుగోలు చేసింది. ఉదిత తర్వాత రెండో అత్యధిక మొత్తం నెదర్లాండ్స్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ యిబ్బీ జాన్సన్‌కు దక్కింది. ఒడిశా వారియర్స్‌ జట్టు రూ. 29 లక్షలకు యిబ్బీ జాన్సన్‌ను సొంతం చేసుకుంది. 

భారత జట్టు సభ్యులు లాల్‌రెమ్‌సియామి (రూ. 25 లక్షలు; శ్రాచి రార్‌ బెంగాల్‌ టైగర్స్‌), సునెలితా టొప్పో (రూ. 24 లక్షలు; ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌), సంగీత కుమారి (రూ. 22 లక్షలు; ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌)లకు కూడా పెద్ద మొత్తమే లభించింది. భారత సీనియర్‌ జట్టు కెపె్టన్‌ సలీమా టెటెను ఒడిశా వారియర్స్‌ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. 

ఇషిక (రూ. 16 లక్షలు), నేహా గోయల్‌ (రూ. 10 లక్షలు)లను కూడా ఒడిశా వారియర్స్‌ కొనుగోలు చేసింది. సూర్మా హాకీ క్లబ్‌ భారత మాజీ కెప్టెన్‌ సవితా పూనియా (రూ. 20 లక్షలు), షర్మిలా దేవి (రూ. 10 లక్షలు), నిక్కీ ప్రధాన్‌ (రూ. 12 లక్షలు)లను దక్కించుకుంది. హెచ్‌ఐఎల్‌ టోర్నీ డిసెంబర్‌ 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాంచీ, రౌర్కెలాలలో జరుగుతుంది.    

#

Tags : 1

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)