Breaking News

40 ప‌రుగుల‌కే ప్ర‌త్య‌ర్ధి ఆలౌట్‌.. 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం

Published on Mon, 07/22/2024 - 21:10

మ‌హిళ‌ల ఆసియాక‌ప్‌-2024లో శ్రీలంక వ‌రుస‌గా రెండో విజ‌యం న‌మోదు చేసింది. దంబుల్లా వేదికగా మలేషియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక బౌలర్ల దాటికి కేవలం 40 పరుగులకే కుప్పకూలింది.

శ్రీలంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో మలేషియా పతనాన్ని శాసించగా.. కావ్యా, కవిష్క తలా రెండు వికెట్లు, ప్రియదర్శిని, కంచనా చెరో వికెట్‌ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్‌(10) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్‌.. 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. 

ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అతపత్తు రికార్డులకెక్కింది. లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)