Breaking News

HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!

Published on Fri, 02/16/2024 - 10:20

Hyderabad Cricket Association: హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్‌ ఆడే నిమిత్తం ఉమెన్‌ టీమ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లింది.

తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్‌ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్‌ మిస్‌ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు.

ఆ సమయంలో సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)కి ఫిర్యాదు చేశారు.

వేటు పడింది
ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్‌ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్‌సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అ‍ధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు,

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)