Breaking News

ఫేవరెట్‌గా జొకోవిచ్‌

Published on Mon, 07/03/2023 - 01:22

లండన్‌: అల్‌కరాజ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ అయినా... ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో అందరి కళ్లూ జొకోవిచ్‌పైనే ఉన్నాయి. ఈ సెర్బియన్‌ స్టార్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ‘హ్యాట్రిక్‌’తో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో టైటిల్‌ చేజిక్కించుకుంటాడనే అంచనాలు పెరిగాయి. మరోవైపు స్పెయిన్‌ సంచలనం అల్‌కరాజ్‌ కూడా టాప్‌ ర్యాంకు ఉత్సాహంతో వింబుల్డన్‌ వేటకు సిద్ధమమయ్యాడు.

మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఎలీనా రిబాకినా కూడా వింబుల్డన్‌ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సమరానికి సై అంటోంది. సోమవారం నుంచి వింబుల్డన్‌ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే సీడింగ్స్, డ్రా విడుదల చేయగా... ఇప్పుడు కోర్టులో టైటిల్‌ వేటే మిగిలింది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డుతో ఉన్న జొకోవిచ్‌ ఇప్పుడు 24వ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.

రెండో సీడ్‌ సెర్బియన్‌ పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో పెడ్రొ కచిన్‌ (అర్జెంటీనా)తో తలపడతాడు. టాప్‌సీడ్‌ కార్లొస్‌ అల్‌కరాజ్‌... జెరెమి చార్డి (ఫ్రాన్స్‌)తో జరిగే మొదటి రౌండ్‌ పోరుతో వింబుల్డన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు.  

మహిళల సింగిల్స్‌లో రిబాకినా వరుసగా రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. గతేడాది ఈ 24 ఏళ్ల కజకిస్తాన్‌ స్టార్‌ వింబుల్డన్‌ ట్రోఫీతో తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ను తృటిలో కోల్పోయింది. ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆమె రన్నరప్‌గా తృప్తిపడింది. టైటిల్‌ నిలబెట్టుకునేందుకు తొలి రౌండ్లో అమెరికన్‌ రోజర్స్‌తో ఆమె తలపడనుంది.

ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి, తాజా ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌)... జు లిన్‌ (చైనా)తో గ్రాండ్‌స్లామ్‌ ఆటను మొదలుపెట్టనుంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అమెరికన్‌ వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినాతో పోటీ పడుతుంది.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)