Breaking News

జొకోవిచ్‌ సాధించేనా?

Published on Mon, 06/30/2025 - 02:24

రెండేళ్ల క్రితం యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. ఈ క్రమంలో టెన్నిస్‌ చరిత్రలోఅత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. మరొక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధిస్తే జొకోవిచ్‌ ఎవరికీ సాధ్యం కాని ఘనతను తన పేరిట లిఖించుకుంటాడు. అయితే గత ఆరు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఈ సెర్బియా స్టార్‌కు నిరాశే ఎదురైంది. 

గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో  నిష్క్రమించిన జొకోవిచ్‌ మిగతా ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో కనీసం సెమీఫైనల్‌ చేరుకున్నాడు. నిరుడు వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన జొకోవిచ్‌ స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ దూకుడుకు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో సెమీఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్‌ టోర్నీలో ‘రికార్డు’ టైటిల్‌ను అందుకోవాలని మరోసారి ప్రయత్నించనున్నాడు.   

లండన్‌: గత ఆరు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. నాలుగుసార్లు గెలిచి, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఏడోసారి కూడా టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరిగా జొకోవిచ్‌ బరిలోకి దిగుతున్నాడు. నేటి నుంచి మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జొకోవిచ్‌ స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్‌ వరకు చేరుకోవడం ఖాయం. 

అయితే తన 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కల నిజం కావాలంటే మాత్రం సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో జొకోవిచ్‌ తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో జొకోవిచ్‌ ప్రత్యర్థి గా ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ), ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) ఎదురవుతారు. గత రెండేళ్లలో జొకోవిచ్‌ తుది పోరులో అల్‌కరాజ్‌ చేతిలోనే ఓడిపోయి రన్నరప్‌ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాడు. 

ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల జొకోవిచ్‌ వచ్చే ఏడాదికల్లా ఏమేరకు ఫిట్‌గా ఉంటాడో చెప్పలేం. సినెర్, అల్‌కరాజ్‌ రూపంలో ఇద్దరు స్టార్స్‌ దూసుకురావడంతో జొకోవిచ్‌ 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నిజం కావాలంటే వింబుల్డన్‌కు మించిన మరో అవకాశం లేదనే చెప్పాలి. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ ముల్లర్‌ (ఫ్రాన్స్‌)తో జొకోవిచ్‌ ఆడనున్నాడు. 

మరోవైపు కెరీర్‌లో ఫైనల్‌ చేరిన ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌పై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి అల్‌కరాజ్‌ విజేతగా నిలిస్తే జాన్‌ బోర్గ్‌ (స్వీడన్‌), పీట్‌ సంప్రాస్‌ (అమెరికా), రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), జొకోవిచ్‌ తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో ‘హ్యాట్రిక్‌ టైటిల్స్‌’ నెగ్గిన ఐదో ప్లేయర్‌గా నిలుస్తాడు. నేడు జరిగే తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)తో అల్‌కరాజ్‌ పోటీపడతాడు. టాప్‌ సీడ్‌ సినెర్‌ తొలి రౌండ్‌లో తన దేశానికి చెందిన లుకా నార్దీతో ఆడతాడు.   

ఈసారీ కొత్త చాంపియన్‌ వచ్చేనా! 
మహిళల సింగిల్స్‌ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్స్‌ ఎవరూ కనిపించడం లేదు. పచ్చిక కోర్టులపై జరిగే వింబుల్డన్‌ టోర్నీలో 2017 నుంచి ప్రతి ఏడాది మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌ అవతరించారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తన టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా లేదో వేచి చూడాలి. 

తొలి రౌండ్‌లో ఫిలిప్పీన్స్‌ సంచలనం అలెగ్జాండ్రా ఇయాలాతో క్రెజికోవా తలపడుతుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌), రెండో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా)తోపాటు మాజీ చాంపియన్స్‌ వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌), రిబాకినా (కజకిస్తాన్‌), జాస్మిన్‌ పావోలిని (ఇటలీ), మాడిసన్‌ కీస్‌ (అమెరికా), స్వియాటెక్‌ (పోలాండ్‌) ఈసారి టైటిల్‌ రేసులో ఉన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)