Breaking News

Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర

Published on Sat, 07/15/2023 - 20:22

Wimbledon 2023, Women's Singles Winner Marketa Vondrousova: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌, చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ మర్కెటా వొండ్రుసోవా సంచలన విజయం సాధించింది. ట్యునీషియా టెన్నిస్‌ స్టార్‌ ఆన్స్‌ జబర్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకుంది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వింబుల్డన్‌ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్‌ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌
కాగా వొండ్రుసోవా చేతిలో ఓడిన 28 ఏళ్ల జబర్‌ గత ఏడాది వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓపెన్‌ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలి అన్‌సీడెడ్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా విజేతగా నిలిచింది. కెరీర్‌లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనే టైటిల్‌ గెలిచింది.

ప్రైజ్‌మనీ ఎంతంటే
అంతకు ముందు 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వొండ్రుసోవా ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది జబర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఆమెను ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీ గెలిచింది. ఇక రన్నరప్‌ ప్లేయర్ జబర్‌‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కనుంది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)