Breaking News

విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. 10 సిక్స్‌ల‌తో! వీడియో వైర‌ల్‌

Published on Sun, 04/28/2024 - 20:41

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆట‌గాడు విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 201 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను జాక్స్ ఊచ‌కోత కోశాడు. 

ఈ క్ర‌మంలో కేవ‌లం 41 బంతుల్లోనే జాక్స్ త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్‌.. 5 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 100 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫ‌లితంగా 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ  కేవ‌లం 16 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. 

ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన నాలుగో ఆట‌గాడిగా జాక్స్ నిలిచాడు. 

ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీ త‌ర‌పున గేల్.. పుణే వారియ‌ర్స్‌పై కేవ‌లం 30 బంతుల్లోనే గేల్ శ‌త‌కం సాధించాడు. ఆ త‌ర్వాతి స్ధానాల్లో యూస‌ఫ్ ప‌ఠాన్‌(37  బంతులు ), డేవిడ్ మిల్ల‌ర్‌(38  బంతులు ), ట్ర‌విస్ హెడ్‌(39  బంతులు ), విల్‌జాక్స్‌(41  బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ త‌రపున ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా జాక్స్ రికార్డుల‌కెక్కాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)