Breaking News

శిబిరానికి రాకుంటే జట్టులోకి రారు!

Published on Sat, 12/20/2025 - 07:40

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త సెలక్షన్‌ పాలసీని తీసుకొచి్చంది. సమాఖ్య ఏర్పాటు చేసే జాతీయ శిక్షణ శిబిరాలకు హాజరైన వారినే ఇక మీదట భారత జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఇకపై శిబిరాల్లో క్రమం తప్పకుండా పాల్గొన్న వారినే ఎంపిక కోసం పరిగణిస్తామని, శిబిరాలను బేఖాతరు చేసే రెజ్లర్లను భారత జట్టుకు ఎంపిక చేయబోమని డబ్ల్యూఎఫ్‌ఐ ప్రకటించింది. అహ్మదాబాద్‌లో ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ జనరల్‌ కౌన్సిల్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలో ఇదే విషయాన్ని కౌన్సిల్‌ సభ్యులు కూడా సూచించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి ఒకరు వెల్లడించారు. 

నో క్యాంప్‌... నో జెర్సీ! 
ఎలైట్‌ రెజ్లర్లయినా, ఐకానిక్‌ ఆటగాళ్లయినా, ఒలింపిక్‌ పతక విజేతలు ఎవరైనా సరే జాతీయ శిక్షణ శిబిరాలకు రావాల్సిందే. శిబిరాలకు ఎంపికైన రెజ్లర్లు డబ్ల్యూఎఫ్‌ఐ ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్‌లో కచి్చతంగా పాల్గొనాలి. వ్యక్తిగతంగా మరో చోట శిక్షణ తీసుకుంటామంటే కుదరదు. సాకులతో శిబిరాలకు గైర్హాజరయ్యే రెజ్లర్లు ఎంతటి వారైనా సరే భారత జట్టుకు ఎంపిక చేయనే చేయరు. శిబిరాలకు ప్రాధాన్యత ఇచ్చి కోచ్‌ మార్గదర్శనంలో శిక్షణ పొందిన, అర్హత గల రెజ్లర్లకు మాత్రమే భారత టీమ్‌ జెర్సీ (బెర్తు) లభిస్తుంది. 

ట్రయల్స్‌ ‘పోటీ’తోనే అంతర్జాతీయ ఈవెంట్లకు... 
అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడాలనుకునే రెజ్లర్లు ఇక మీదట తప్పనిసరిగా సెలక్షన్‌ ట్రయల్స్‌లోనూ పోటీపడాల్సి 
ఉంటుంది. గత పతక ఘనతలు, ర్యాంకింగ్‌ను ఏమాత్రం పరిగణించరు. కేవలం ప్రస్తుత ఫామ్, సెలక్షన్‌ ట్రయల్స్‌లో సత్తా చాటితేనే భారత జట్టుకు ఎంపిక చేస్తారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)