Breaking News

విండీస్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం.. వరల్డ్‌ కప్‌ విన్నర్‌ కన్ను మూత

Published on Mon, 10/06/2025 - 14:04

వెస్టి‍ండీస్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్‌, వరల్డ్‌కప్ విన్నర్ బెర్నార్డ్ జూలియన్(75) మరణించారు. అనారోగ్యం కారణంగా ట్రినిడాడ్‌లోని ఓ అస్పత్పిల్రో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షాలో ధ్రువీకరించారు.

"బెర్నార్డ్ జూలియన్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. విండీస్ గొప్ప క్రికెటర్లలో జూలియన్ ఒకరు. ఆయన సుదీర్ఘ కాలం పాటు విండీస్ క్రికెట్‌కు తన సేవలను అందించాడు. విండీస్ క్రికెట్ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయంగా నిలిపోతారు.

బెర్నార్డ్ జూలియన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని ఓ ప్రకటనలో  కిషోర్ షాలో పేర్కొన్నారు. మరో విండీస్ లెజెండ్, మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ సైతం బెర్నాల్డ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బెర్నాల్డ్‌తో తన జ్ఞాపకాలను లాయిడ్ గుర్తుచేసుకున్నారు.

1975లో వెస్టిండీస్ తొలిసారిగా ప్రపంచకప్ గెల‌వ‌డంలో జూలియన్‌ది కీల‌క పాత్ర. టోర్నీ అంత‌టా ఆల్‌రౌండ‌ర్‌గా ఆయ‌న అద‌ర‌గొట్టారు. సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్‌పై 4 వికెట్లతో స‌త్తాచాటిన బెర్నార్డ్‌.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 26 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచి విండీస్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపారు.  జూలియ‌న్ త‌న కెరీర్‌లో విండీస్ త‌ర‌పున 24 టెస్టు మ్యాచ్‌లు, 12 వ‌న్డేలు ఆడారు. మొత్తంగా 932 ప‌రుగులు, 68 వికెట్లు ప‌డ‌గొట్టారు.
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)