Breaking News

పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా..

Published on Wed, 10/25/2023 - 20:27

ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: భారత్‌ వేదికగా వరల్డ్‌కప్-2023లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపింది. డచ్‌ జట్టును ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. సౌతాఫ్రికాపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న డచ్‌ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్‌ వన్‌సైడ్‌ చేసింది. 

తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర
తద్వారా ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో అత్యంత భారీ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(104) సెంచరీతో అదరగొట్టగా.. స్టీవ్‌ స్మిత్‌ 71, మార్నస్‌ లబుషేన్‌ 62 పరుగులతో రాణించారు.

మాక్సీ పరుగుల సునామీ
వీరిద్దరు అర్ధ శతకాలతో రాణిస్తే ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు,8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. మాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించింది.

స్టార్క్‌ ఆరంభిస్తే.. జంపా ముగించాడు
ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆసీస్‌ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ వికెట్ల పతనం ఆరంభించగా.. స్పిన్నర్‌ ఆడం జంపా లోయర్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ క్రమంలో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి నెదర్లాండ్స్‌ ఆలౌట్‌ అయింది. 21 పరుగులకే కథ ముగించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. బ్యాట్‌తో రాణించలేకపోయిన మిచెల్‌ మార్ష్‌ రెండు వికెట్లు కూల్చాడు. ఇక ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ మీద ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఫాస్టెస్ట్‌ సెంచరీ హీరో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)