Breaking News

వరల్డ్‌కప్‌ నుంచి అఫ్గాన్‌ ఔట్‌.. దక్షిణాఫ్రికా ఘన విజయం

Published on Fri, 11/10/2023 - 21:53

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ప్రోటీస్‌ విజయంలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్(76 నాటౌట్‌) కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(41), ఆండిలే ఫెహ్లుక్వాయో( 39 నాటౌట్‌) పరుగులతో రాణించారు. అఫ్గాన్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్‌ ఒక్క వికెట్‌ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.

అఫ్గాన్‌ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(91 నాటౌట్‌) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రోటీస్‌ బౌలర్లలో పేసర్‌ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహారాజ్‌, ఎంగిడి తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ ఓటమితో అఫ్గానిస్తాన్‌ వరల్డ్‌కప్‌ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ​ మెగా టోర్నీ సెకెండ్‌ సెమీఫైనల్లో నవంబర్‌ 12న కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
చదవండి: మాథ్యూస్‌ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)