Breaking News

WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్‌ ఆఫ్రిది.. తొలి బౌలర్‌గా రికార్డు

Published on Tue, 10/31/2023 - 14:37

ICC WC 2023- Ban Vs Pak: భారత్‌ వేదికగా వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌ తరఫున అరుదైన ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 

ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా బాబర్‌ ఆజం బృందం మంగళవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తొలి ఓవర్లోనే వికెట్‌
ఈ క్రమంలో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ ఆఫ్రిది తొలి ఓవర్లోనే వికెట్‌ పడగొట్టాడు. మొదటి ఓవర్‌ ఐదో బంతికి బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పర్ఫెక్ట్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఆఫ్రిది సంధించిన బంతి వికెట్లను హిట్‌ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో తాంజిద్‌ వెనుదిరగతప్పలేదు.

సక్లెయిన్‌ ముస్తాన్‌ దీంతో పాకిస్తాన్‌కు తొలి వికెట్‌ దక్కగా.. షాహిన్‌ ఆఫ్రిది తన అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పాక్‌ బౌలర్లలో ఇంత వరకు సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు. తక్కువ మ్యాచ్‌లలోనే వంద వికెట్లు పడగొట్టిన పాక్‌ తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతంగా(మ్యాచ్‌ల పరంగా) వంద వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్లు వీరే..
►సందీప్‌ లమిచానే(నేపాల్‌)- 42 మ్యాచ్‌లలో
►రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌)- 44 మ్యాచ్‌లలో
►షాహిన్‌ ఆఫ్రిది(పాకిస్తాన్‌)- 51 మ్యాచ్‌లలో
►మిచెల్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా)- 52 మ్యాచ్‌లలో
►సక్లెయిన్‌ ముస్తాక్‌(పాకిస్తాన్‌)- 53 మ్యాచ్‌లలో.

చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్‌ రికార్డు మనదే 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)