Breaking News

నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌.. పాక్‌ను వెనక్కి నెట్టి

Published on Fri, 11/03/2023 - 20:05

వన్డే ప్రపంచకప్‌-2023లో అఫ్గానిస్తాన్‌ మరో అద్బుత విజయం సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ షాహిదీ(56నాటౌట్‌) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్‌ షా(52) పరుగులతో రాణించాడు.

డచ్‌ బౌలర్లలో వాన్‌బీక్‌, జుల్ఫికర్‌, వాండర్‌ మెర్వ్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ విజయంతో అఫ్గానిస్తాన్‌.. పాకిస్తాన్‌ వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది.

డచ్‌ బ్యాటర్లలో నలుగురు రనౌట్ల రూపంలో వెనుదిరిగారు. అఫ్గాన్‌ బౌలర్లలో నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. నూర్‌ అహ్మద్‌ రెండు, ముజీబ్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(58) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి