Breaking News

WC 2023: క్రేజీ ఇన్నింగ్స్‌.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్‌

Published on Wed, 10/25/2023 - 21:24

WC 2023 Aus Vs Ned- Pat Cummins Comments: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రికార్డు విజయం సాధించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితో గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం తలపడింది ఆస్ట్రేలియా.

ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్‌ గెలిచిన కమిన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని డచ్‌ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. డేవిడ్‌ వార్నర్‌(104) శతకంతో చెలరేగగా.. స్టీవ్‌ స్మిత్‌ 71, మార్నస్‌ లబుషేన్‌ 62 పరుగులు సాధించారు. 

ఫాస్టెస్ట్‌ సెంచరీతో దుమ్ములేపాడు
వీరి ముగ్గురి ఇన్నింగ్స్‌ను మరిపించేలా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 తరహా వినోదం అందించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు స్కోరు చేశాడు.

90 పరుగులకే నెదర్లాండ్స్‌ ఆలౌట్‌
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించిన ఆసీస్‌.. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా అత్యధికంగా 4 వికెట్లు దక్కించుకోగా.. మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మిచెల్‌ మార్ష్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియా తర్వాత..
ఈ క్రమంలో వన్డే చరిత్రలో ప్రత్యర్థిని అత్యంత భారీ తేడాతో ఓడించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీమిండియా(శ్రీలంక మీద 317 పరుగుల తేడాతో) తర్వాత ఈ ఘనత సాధించిన టీమ్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.

చాలా చాలా సంతోషంగా ఉంది
ఈ నేపథ్యంలో విజయానంతరం ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన విజయం. ప్రత్యర్థికి 400 పరుగుల లక్ష్యాన్ని విధించడం.. దానిని కాపాడుకోవడం.. రెండింటిలోనూ మేము పూర్తిగా విజయవంతమయ్యాం.

ఆ వందలో నాకూ భాగం ఉంది
ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. క్రేజీ ఇన్నింగ్స్‌. ఆ వంద పరుగుల భాగస్వామ్యంలో మా ఇద్దరి పాత్ర సమానమే కదా(నవ్వులు).. అద్భుతమైన ఇన్నింగ్స్‌. నేనిలాంటి క్లీన్‌ హిట్టింగ్‌ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు’’ అంటూ మాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపించాడు.

అదే విధంగా స్మిత్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్న కమిన్స్‌.. ‘‘మా ఆట తీరు ఎలా ఉండాలనుకుంటామో ఈరోజు అలాగే ఆడాం. పవర్‌ ప్లేలో వీలైనన్ని వికెట్లు తీయాలన్న వ్యూహం అమలు చేశాం. జంపా మరోసారి నాలుగు వికెట్లు కూల్చాడు’’ అని బౌలింగ్‌ విభాగాన్ని కూడా ప్రశంసించాడు.

మాక్సీ- కమిన్స్‌ జోడీ చరిత్ర.. అందుకే అలా సరదాగా
కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వరల్డ్‌కప్‌ చరిత్రలో 100+ పరుగుల భాగస్వామ్యంలో హయ్యస్ట్‌ రన్‌రేటు(14.37 (103) సాధించిన మూడో జోడీగా మాక్స్‌వెల్‌- కమిన్స్‌ జోడీ చరిత్ర సృష్టించింది. ఈ గణాంకాలను ఉద్దేశించే కమిన్స్‌.. మాక్సీతో పాటు తాను కూడా ఈ పార్ట్‌నర్‌షిప్‌లో సమాన పాత్ర పోషించానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చదవండి: WC 2023: పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)