Breaking News

మాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ

Published on Wed, 10/25/2023 - 18:01

WC 2023- #AUSvsNED- #GlennMaxwellFastestCentury: వన్డే వరల్డ్‌కప్‌-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.

ఏకంగా 252.50 స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్‌-2023లో ఢిల్లీలోనే మార్కరమ్‌ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే.

వరల్డ్‌కప్‌ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు(ఎదుర్కొన్న బంతుల పరంగా) నమోదు చేసింది వీరే
►40 - గ్లెన్ మాక్స్‌వెల్‌ నెదర్లాండ్స్‌ మీద, ఢిల్లీలో-2023
►49 - ఎయిడెన్‌ మార్కరమ్‌ శ్రీలంక మీద, ఢిల్లీలో- 2023
►50 - కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్‌ మీద, బెంగళూరులో- 2011
►51 -గ్లెన్ మాక్స్‌వెల్‌  శ్రీలంక మీద, సిడ్నీలో- 2015
►52 - ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్‌ మీద, సిడ్నీలో 2015

ఆస్ట్రేలియా భారీ స్కోరు:
నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ 104 , స్టీవ్‌ స్మిత్‌ 71, మార్నస్‌ లబుషేన్‌ 62 పరుగులతో అదరగొట్టగా.. మాక్సీ సునామీ ఇన్నింగ్స్‌ కారణంగా ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన నెదర్లాండ్స్‌ ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)