Breaking News

వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!

Published on Sun, 11/17/2024 - 21:02

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి స‌ర్వం సిద్ద‌మైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదిక‌గా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ మెగా వేలంలో అంద‌రి క‌ళ్లు టీమిండియా ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుంద‌ర్ ఎంత ధ‌ర‌కు అమ్ముడు పోతాడ‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్ర‌మంలో టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ నిర్వ‌హించిన మాక్ వేలంలో వాషింగ్ట‌న్‌కు క‌ళ్లు చెదిరే ధ‌ర ద‌క్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్ట‌న్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్‌లైన్‌లో కండ‌క్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుంద‌ర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్ల‌కు బిడ్ వేసింది. 

ఆ త‌ర్వాత స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పోటీలోకి వ‌చ్చింది. ఎస్ఆర్‌హెచ్ క్రమక్రమంగా వాషింగ్ట‌న్  ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి త‌ప్పుకొని గుజ‌రాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజ‌రాత్ జెయింట్స్ సుంద‌ర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుంద‌ర్ గ‌త కొన్ని సీజ‌న్ల‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అత‌డిని ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోలేదు.
న్యూజిలాండ్‌పై అదుర్స్‌..
కాగా ఐపీఎల్‌-2024లో సుందర్‌ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సుందర్‌ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్‌ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్‌ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్‌!?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)