Breaking News

హెడ్‌, స్మిత్ మెరుపులు.. సూప‌ర్ కింగ్స్ చిత్తు

Published on Sat, 07/20/2024 - 13:02

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2024 టోర్నీలో వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్ త‌మ జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. డ‌ల్లాస్ వేదిక‌గా టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. వాషింగ్టన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు.

హెడ్‌ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేయగా.. స్మిత్‌ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్‌ చేశాడు. వీరిద్దరితో పాటు మాక్స్‌వెల్‌(34), పియెనార్(33) పరుగులతో రాణించారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో నూర్‌ ఆహ్మద్‌ మూడు వికెట్లు, బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. 

తిప్పేసిన స్పిన్నర్లు..
అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ 164 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర 4 వికెట్లతో సత్తాచాటగా.. జస్‌దీప్‌ సింగ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి సూపర్‌ కింగ్స్‌ పతనాన్ని శాసించారు. సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌ 55 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు