Breaking News

ఇక్కడైతే రోజుకు రూ. 25 లక్షలు..

Published on Tue, 03/19/2024 - 15:36

దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌ కామెంటేటర్‌గా పునరాగమనం చేయనున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు. మరోసారి తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీని ధ్రువీకరిస్తూ సిద్ధు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

తన ఫస్ట్‌ లవ్‌ క్రికెట్‌ అన్న ఈ పంజాబీ బ్యాటర్‌.. చేపకు ఈత నేర్పడం ఎటువంటిదో తనకు కామెంట్రీ గురించి ఎవరైనా కొత్తగా చెప్పడం కూడా అలాంటిదేనన్నాడు. గ్యాప్‌ వచ్చినా తన మాటల పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు సిద్ధు.

తన కెరీర్‌లో కఠిన సవాళ్ల అనంతరం సుమారు 20 సార్లు రీఎంట్రీ ఇచ్చానన్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు.. కామెంటేటర్‌గా మాత్రం ఇదే తొలి కమ్‌బ్యాక్‌ అని పేర్కొన్నాడు. వ్యాఖ్యాతగా ప్రయాణం ప్రారంభించాలనుకున్నపుడు తను ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా లేనన్న సిద్ధు.. వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెంట్లో కూడా అదరగొట్టడం అభిమానులతో పాటు తననూ ఆశ్చర్యపరిచిందన్నాడు. 

గతంలో ఇలాంటి మేజర్‌ టోర్నీ మొత్తం కామెంట్రీ చేసినందుకు రూ. 60- 70 లక్షలు పారితోషకంగా అందుకునే వాడినన్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు.. ఐపీఎల్‌లో మాత్రం రోజుకు రూ. 25 లక్షలు వస్తాయని చెప్పాడు. అయితే, ఐపీఎల్‌లో కేవలం డబ్బు వల్ల మాత్రమే సంతృప్తి దొరకదని.. పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఇక టీ20 ప్రపంచకప్‌-2024 కంటే ముందు ఐపీఎల్‌ రూపంలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకనుందన్న సిద్ధు.. ఇప్పుడు అందరి కళ్లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మీదనే ఉన్నాయన్నాడు. కేవలం టీమిండియా ఆటగాళ్లకే కాకుండా ప్రధాన జట్టు ఆటగాళ్లంతా వరల్డ్‌కప్‌ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఐపీఎల్‌-2024 ప్రదర్శనే ప్రామాణికంగా ఉండబోతుందని సిద్ధు అభిప్రాయపడ్డాడు. పీటీతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా రాజకీయాల్లోనూ ప్రవేశించిన సిద్ధుకు పంజాబ్‌ మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఇక మార్చి 22న ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభం కానుంది. చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ ఈవెంట్‌ షురూ కానుంది.

చదవండి: T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)