Breaking News

క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న లంక స్పిన్నర్‌

Published on Tue, 07/11/2023 - 20:47

ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్‌ వనిందు హసరంగ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ (జూన్‌) అవార్డు దక్కించుకుంది. మహిళల యాషెస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ గార్డ్‌నర్‌ను ఈ అవార్డు వరించింది. 

పురుషుల విభాగంలో జింబాబ్వే సీన్‌ విలియమ్స్‌, ఆస్ట్రేలియా ట్రవిస్‌ హెడ్‌ నుంచి హసరంగకు పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా అతన్నే ఈ అవార్డు వరించింది. మహిళల విభాగంలో ఇంగ్లండ్‌ ట్యామీ బేమౌంట్‌, వెస్టిండీస్‌ హేలీ మాథ్యూస్‌ ఐసీసీ అవార్డు కోసం పోటీపడగా జ్యూరీ గార్డ్‌నర్‌వైపు మొగ్గు చూపింది. జూన్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు,  ఐసీసీ-క్రికెట్‌.కామ్‌లో నమోదు చేసుకున్న గ్లోబల్ క్రికెట్ అభిమానులతో కూడిన ప్రత్యేక ప్యానెల్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. 


 

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు