Breaking News

శ్రీలంక స్టార్‌ ఆటగాడు విధ్వంసం​.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ!

Published on Sun, 08/06/2023 - 09:15

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో బి లవ్ క్యాండీ జట్టు రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ.. కేవలం 13 ఓవర్లలోనే ఊదిపడేసింది. 

హసరంగా ఆల్‌ రౌండ్‌ షో..
ఈ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్‌ వనిందు హసరంగా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి  జాఫ్నా కింగ్స్‌ పతనాన్ని శాసించిన హసరంగా.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ము రేపాడు. కేవలం 21 బంతుల్లోనే హసరంగా తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా వనిందు నిలిచాడు.

ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న హసరంగా.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగుల చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఫఖర్‌ జమాన్‌(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన జాఫ్నా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 117 పరుగులు మాత్రమే చేయగల్గింది. క్యాండీ బౌలర్లలో హసరంగాతో పాటు ప్రదీప్‌ మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నాను దెబ్బతీశాడు. జాఫ్నా బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే(38) పరుగలతో ఒంటరి పోరాటం చేశాడు.
చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు!

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు